- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ విజయేందిర బోయి
జిల్లాలో ఈనెల 11 న నిర్వహించబోయే మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో ఈనెల 11 న నిర్వహించబోయే మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్‌వీఎస్ ఆడిటోరియంలో నిర్వహించిన పిఓ లు, ఎపిఓ ల రెండో విడత శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని దిశా నిర్దేశం చేశారు. పిఓ లకు ఇచ్చిన ఎన్నికల నియమావళి హ్యాండ్‌బుక్‌ను భగవద్గీతలా భావించి ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదివి ఎన్నికల నిర్వహణ పై మరింత అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బంది తమ తమ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో, భూత్పూర్ మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, దేవరకద్ర మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని దేవరకద్ర మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సమయానికి చేరుకుని స్టాట్యూటరీ, నాన్‌స్టాట్యూటరీ పోలింగ్ సామగ్రిని స్వీకరించాలని సూచించారు.
సామగ్రి స్వీకరణ సమయంలో చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని వస్తువులు ఉన్నాయా లేదా సరి చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ సరిగా ఉందా, సీరియల్ నెంబర్లు ఓటర్ లిస్ట్ మార్క్డ్ కాపీతో సరిపోతున్నాయా, ఫారం-7 ప్రకారం పోటీ అభ్యర్థుల పేర్లు, బ్యాలెట్ పేపరుతో పోల్చి సరిగా ఉన్నాయా పరిశీలించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ సరిగా పని చేస్తుందా లేదా నిర్ధారించుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ముందురోజే అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు మార్కింగ్ చేసి ఆ పరిసరాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగకుండా చూడాలని పిఓ లకు ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ విధానాన్ని సూచించే స్టిక్కర్లు, పోస్టర్లు గోడలపై అంటించాలని, మోడల్ పోలింగ్ కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చైర్లు, టేబుళ్లు ఏర్పాటు చేసి కేంద్రాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ పేపర్ అకౌంట్, పిఓ డైరీలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పై అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, మాట్లాడుతూ పిఓ లు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించి, రూల్ పొజిషన్‌కు అనుగుణంగా ఎన్నికల సమయంలో తమ విధులన నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ సమయంలో పి ఓలకు ఏవైనా సందేహాలు తలెత్తితే వారికి అందజేసిన పిఓ హ్యాండ్‌బుక్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, డిఇఓ ప్రవీణ్ కుమార్, సిఎంఓ సుధాకర్, ఎయంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.






