- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీ లలో నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ జానకి తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీ లలో నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా 13 న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ లోని స్ట్రాంగ్ రూమ్ లు, రిసెప్షన్ సెంటర్ లను పరిశీలించి భద్రతా చర్యల కై పలు సూచనలు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయాలని, 24 గంటల నిఘా, సీసీ కెమెరా పర్యవేక్షణ, నియమిత బందోబస్తు కొనసాగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లోనే ఉంటుందని, ఎలాంటి చట్ట విరుద్ధ చర్యలు, గందరగోళ పరిస్ధితులు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు తావు ఇవ్వబోమని ఆమె హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించినందుకు జిల్లా పోలీసు శాఖ తరఫున ఎస్పీ జానకి కృతజ్ఞతలు తెలియజేశారు.






