మున్సిపల్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

by I. Sairam |

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నందున, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా విని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పొందాలని తెలిపారు.

ఏవైనా సందేహాలు ఏర్పడితే, ప్రిసైడింగ్ అధికారులకు అందజేసిన కరదీపిక ను జాగ్రత్తగా అధ్యయనం చేసి, చట్టబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని పునరుద్ఘాటించారు. అలాగే, తమకు కేటాయించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకొని, ఫారం-12 కు సంబంధించిన అన్ని ఎన్నికల సామగ్రిని పూర్తిగా పరిశీలించి, ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సీఎంఓ సుధాకర్ రెడ్డి, మాస్టర్ శిక్షకులు బాలు యాదవ్ బైకాని, నాగరాజు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Next Story