- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం మెగా హెల్త్ క్యాంపులో పాల్గొంటున్నారని, వారందరికీ పాలమూరు ఎస్వీఎస్ మెడికల్ కళాశాల, సీబీఎం ట్రస్ట్ సౌజన్యంతో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహల సూచనలు మేరకు గతంలో నిర్వహించిన సర్జికల్ క్యాంపులో 1467 మందికి ఆపరేషన్లు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ మెగా మల్టీ స్పెషాలిటీ క్యాంపులో సైతం అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైతే ఆపరేషన్లు అవసరం ఉంటుందో వారికి సై తం ఎస్సీ ఎస్ మెడికల్ కళాశాల వారు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారన్నారు. ఈ అవకాశం నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సర్జికల్ క్యాంపు లో దాదాపు 40 మంది ప్రత్యేక నిపుణులైన డాక్టర్లలతో పాటు జనరల్ డాక్టర్లు మరో 60 మంది, ఇతర సిబ్బంది మరో 50 మందితో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 15 వందల వరకు ఓపి నమోదైనటు వైద్యం తెలిపారు. పరీక్షలకు వచ్చిన వారందరికీ కూడా భోజన సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ ప్రభు, అదనపు వైద్యాధికారి డాక్టర్ తార సింగ్, డాక్టర్లు మహేష్, పావని, రామకృష్ణ ఉన్నారు.






