- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎస్ఎస్ జాతీయ సమైక్యతను పెంపొందిస్తుంది : ఎంపీ డీకే అరుణ
by Ratna Kumari |
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ వీరన్నపేటలోని నీలకంఠ స్వామి దేవాలయంలో ఆమె పూజలు నిర్వహించి 'పద సంచలనం' కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల నిస్వార్థ సేవ ఉందని, విపత్తు సమయాల్లో సహాయక చర్యలు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను నిర్వహించడం వంటి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటుందని ఆమె అన్నారు. అనంతరం అక్కడి నుంచి న్యూగంజ్ మీదుగా పట్టణ పుర వీధుల్లో ఆర్ఎస్ఎస్ కరసేవకులు ప్రత్యేక డ్రెస్ కోడ్ తో చేతిలో కర్ర, తల పై క్యాప్ తో 'పద సంచలనం' తో కదం తొక్కగా పట్టణ ప్రజలు పూల వర్షంతో సాదర స్వాగతం పలికారు.
Next Story






