గర్భిణీలకు అమ్మ ఒడి

by Ratna Kumari |

దిశ, వీపనగండ్ల : ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తున్న 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అమూల్యమైన భరోసాగా ని

గర్భిణీలకు అమ్మ ఒడి
X

దిశ, వీపనగండ్ల : ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తున్న 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అమూల్యమైన భరోసాగా నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 50 అమ్మఒడి అంబులెన్సులు నిరంతరంగా సేవలందిస్తూ తల్లి శిశు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గర్భధారణ తొలి దశ నుంచే స్కానింగ్, రక్తపరీక్షలు, టీకాలు ఆంటీనేటల్ చెకప్‌ల కోసం గర్భిణీలను ఇంటి వద్ద నుంచి ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి, పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి చేర్చడం జరుగుతోంది. అలాగే ప్రసవం అనంతరం తల్లి–పసిబిడ్డను పూర్తిగా ఉచితంగా, భద్రంగా ఇంటికి తరలించే సౌకర్యం కల్పిస్తున్నారు. నవజాత శిశువుల టీకాల కోసం కూడా ఇంటి నుంచి ఆసుపత్రికి రాకపోకల సేవలు అందిస్తున్నారు. ఈ సేవలపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా 102 అంబులెన్స్ ప్రోగ్రాం మేనేజర్ రవి మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తల్లి శిశు భద్రతే లక్ష్యంగా తమ బృందం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Next Story