- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పిల్లలను సంపులో వేసి తల్లి ఆత్మహత్య..
ఇద్దరు పిల్లలను నీటి సంపు లో పడేసి, తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో ఇద్దరు పిల్లలను నీటి సంపు లో పడేసి, తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోతేపల్లికి చెందిన ఎనుముల శిరీష (23) మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు మానశ్రీ(3), కొడుకు వర్షిత్ (4 నెలలు) ఉన్నారు. కాగా శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి, తాను అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి ఎస్సై యుగంధర్ రెడ్డి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






