హ‌త్య‌ల్లో చ‌నిపోయిన వారి కంటే రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారే ఎక్కువ : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

by Ratna Kumari |

రాష్ట్రంలో హత్యల్లో చనిపోయిన వారి కంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని తద్వారా వారిని నమ్ముకున్న వేలాది కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో రోడ్డున పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు.

హ‌త్య‌ల్లో చ‌నిపోయిన వారి కంటే రోడ్డు ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారే ఎక్కువ : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : రాష్ట్రంలో హత్యల్లో చనిపోయిన వారి కంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని తద్వారా వారిని నమ్ముకున్న వేలాది కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో రోడ్డున పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మండలంలోని చంద్ర గార్డెన్ లో ఏర్పాటు చేసిన అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రతపై చేపట్టిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ సేఫ్టీ కనెక్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ యాప్ ను ఉపయోగించాలని ఈ యాప్ డ్రైవింగ్ విధానాన్ని పర్యవేక్షించి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు సహకరిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం వివిధ సంఘటనలో హత్యలకు గుర‌య్యే వారి సంఖ్య కన్నా పది రేట్లు ఎక్కువగా ఉందని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని డిజిపి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో గత సంవత్సరం 24 మంది హత్యల్లో చనిపోతే 240 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని దీన్ని బట్టి రోడ్డు ప్రమాదాలను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి గ్రామంలో హెల్మెట్ లేనిదే తమ గ్రామంలోకి అనుమతి లేదని తీర్మానాలు చేసే విధంగా గ్రామపంచాయతీలను ప్రోత్సహించాలని డిజిపి సూచించారు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలి

ఎమ్మెల్యేలు అందరూ ఆదర్శంగా ఉండాలని, మన వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగకూడదని మనం నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో తిరిగితే మన కార్యకర్తలు కూడా అలాగే తిరుగుతారని ప్రతి ఒక్కరు హెల్మెట్ సీట్ బెడ్ తో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు. తన నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి వెళ్తుండడంతో తన నియోజకవర్గంలోని చాలామంది రోడ్డు ప్రమాదాల్ల బారినపడి మరణించడంతో వారి కుటుంబాలు దిక్కులేని మిగిలిపోతున్నాయని తెలిపారు. కుటుంబం పెద్దను కోల్పోయిన బాధ ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుందని, అలా మరే కుటుంబానికి కూడా ఆ బాధ రాకూడదు అంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ లేని ప్రయాణం సీట్ బెల్ట్ లేని డ్రైవింగ్ చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అయిందని రూరల్ పోలీస్ స్టేషన్ కూడా అవసరం ఉందని ఈ రెండు పోలీస్ స్టేషన్లను మంజూరు చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ, గద్వాల జోగులంబ జోనల్ డీఐజీ చౌహన్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు సిఐలు, ఆర్టీసీ ఆర్ఎం కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Next Story