- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా తుపాన్.. తీవ్రంగా దెబ్బతిన్న పంటలు..!
దిశ, అమ్రాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని ఈదుల బావి గ్రామానికి చెందిన చిక్కుడు యాదయ్యఅనే రైతు వేసిన పత్తి పంట మొంథా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది.

X
దిశ, అమ్రాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని ఈదుల బావి గ్రామానికి చెందిన చిక్కుడు యాదయ్యఅనే రైతు వేసిన పత్తి పంట మొంథా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. రైతు 4 ఎకరాలలో పత్తి పండించి 15 కింటల్లో పత్తి తీసి పొలంలోనే భద్రపరిచాడు. దీంతో అకస్మాత్తుగా వర్షం వరద రావడంతో పంట నష్టం పత్తి నష్టం జరిగి తనకు చేతికి అందిన పంట వరద పాలవ్వడంతో రెండు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎడ తెరపి లేకుండా వర్షం కురవడంతో మండలంలోని చాలా పంటలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు
Next Story






