మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి : క‌లెక్ట‌ర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వ‌డంతో ఎన్నికల ప్రవర్తనా నియమానవళి పకడ్బందీగా అమలుకు

మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి : క‌లెక్ట‌ర్  విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వ‌డంతో ఎన్నికల ప్రవర్తనా నియమానవళి పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీఓలు, తహశీల్దార్ లు, ఎఫ్ఎస్టీ బృందాలు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఎంపీఓ లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిష్పక్ష పాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు.

ఎఫ్ఎస్టీ టీమ్ లు సమర్థంగా పని చేయాలని, విద్యుత్ స్తంభాలు, డివైడర్ల పై పబ్లిక్ ప్రదేశాలలో కూడా రాజకీయ పార్టీల పోస్టర్ లు తొలగించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ఊరేగింపుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, లౌడ్ స్పీకర్ లు, రోడ్ షో లకు నిర్దేశిత సమయం లోగా ముగించాలని తెలిపారు. కొత్త పథకాలు శంకుస్థాపనలు, ప్రారంభం చేయవద్దని, కరపత్రాలు పోస్టర్ లపై ప్రచురణకర్త పేరు, కాపీల సంఖ్య ముద్రించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 x 7 హెల్ప్ లైన్, ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసి, పౌర సరఫరాల సంస్థ డీఎం ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ఖర్చు నమోదు చేయాలని.. నిర్ణీత ప్రోఫార్మా ప్రకారం.. ఎన్నికలలో ప్రచార వ్యయం సమర్పించాలని అన్నారు.


ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలన్నారు. మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరి చూసుకోవాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్ లను గుర్తించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓ లు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీసిఈఓ వెంకటరెడ్డి, డిపిఓ పార్థ సారథి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Next Story