నీట్ పరీక్ష లీకు మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి

by velandi.Saikiran |

నీట్ పేపర్ ను లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నార‌ని, అందుకు ప్రధాన కారకుడైన కేంద్ర విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.

నీట్ పరీక్ష లీకు మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి
X

దిశ, అచ్చంపేట : నీట్ పేపర్ ను లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నార‌ని, అందుకు ప్రధాన కారకుడైన కేంద్ర విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతీ పరీక్ష లీక్ అవుతుందని విమ‌ర్శ‌లు చేశారు. దీనిపైన‌ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నల్లమల్ల నుంచి మరోసారి కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ పోరాటం ప్రారంభించామన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుప్పకూలే వరకు కాంగ్రెస్ పార్టీ విస్మరించకుండా పోరాటం చేస్తూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story