- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీల రిజర్వేషన్ లను అడ్డుకుంటుంది బీజేపీ ప్రభుత్వమే : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
దిశ, వనపర్తి : బీసీలకు 42 % రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని రెండు నాలుకల వైఖరి వహించే బీజేపీ నేతల దురుద్దేశం రాష్ట్ర

దిశ, వనపర్తి : బీసీలకు 42 % రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని రెండు నాలుకల వైఖరి వహించే బీజేపీ నేతల దురుద్దేశం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 % రిజర్వేషన్ పై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా ప్రధానమంత్రిని కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని పదే పదే కోరినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలేదని ఎమ్మెల్యే తెలిపారు. బీసీలకు కు 42 %రిజర్వేషన్ పై మంకుపట్టు వీడని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ అంశంపై ఈ నెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.






