- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే సార్.. మీరైనా స్పందిస్తారా..? నవ జీవన క్లబ్ వద్ద నిరసన
దిశ, మహమ్మదాబాద్: మండల కేంద్రంలోని నవ జీవన రి-క్రియేషన్ క్లబ్ వద్ద వివాదాస్పద నిర్మాణంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 200 మందికి పైగా గ్రామస్తులు భారీగా చేరి రోడ్డుపైకి వచ్చి నిర

దిశ, మహమ్మదాబాద్: మండల కేంద్రంలోని నవజీవన రి-క్రియేషన్ క్లబ్ వద్ద వివాదాస్పద నిర్మాణంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 200 మందికి పైగా గ్రామస్తులు భారీగా చేరి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సారు మీరైనా స్పందిస్తారా లేదా? అంటూ ప్లకార్డులతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గుళ్ల చెన్నయ్య మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం క్లబ్‌లోనే నేను ఎన్నో పౌరాహిక నాటకాలను నేర్పాను. తర్వాత వెటర్నరీ ఆసుపత్రిని బదిలీ చేయడమే కాక బిల్డింగ్‌ను కూడా కూల్చేశారు. మా గ్రామ ప్రజలు సహనంతో చూశారు. ఇప్పుడు అధికారులు తమ తప్పును సరిదిద్దుకోవాలి” అని డిమాండ్ చేశారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కొత్త నర్సింలు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉన్న భవనానికి అక్రమంగా నాలా అనుమతులు ఇవ్వడం ఎలా? ఊర్లో ఎవ్వరూ లేరనుకున్నారా? ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరు ఊరుకోదు” అని హెచ్చరించారు. మంగంపేట మాజీ సర్పంచ్ గీత పాండు మాట్లాడుతూ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య బ్యాంక్ అవసరం ఉంది. అందుకే మహిళలు పెద్ద ఎత్తున పోరాటంలో భాగస్వామ్యం కావాలి” అని మహిళలను ఉత్సాహపరిచారు. సామాజిక కార్యకర్త గోపాల్ మాట్లాడుతూ ఈ పోరాటం మహిళా సమాఖ్యకు న్యాయం జరిగే వరకు ఆగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది మాట అన్నారు. తరువాత గ్రామస్థులు బస్టాండ్‌లో రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌ను నిలిపి నిరసన కొనసాగించారు. నవ జీవన క్లబ్ వద్ద వంటవార్పు చేసి గ్రామస్తులు కలిసి అంతా అక్కడే భోజనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు రాజేశ్వర్, గీత పాండు, ఈ. పవన్ కుమార్, ముస నరసింహ, చిట్యాల నరేష్, కొత్త నర్సింలు, దస్తయ్యలతో పాటు గ్రామస్థులు భారీ పాల్గొన్నారు.






