- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
దిశ, మహహ్మదాబాద్ : పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

దిశ, మహహ్మదాబాద్ : పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.కొడంగల్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పరిగి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్పడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కమతం విష్ణు వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కే.ఎం. నారాయణ పాల్గొన్నారు.






