విద్యార్థుల కోసం అత్యాధునిక వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-14 10:30:26  IST  )

దిశ‌, బిజినెప‌ల్లి : మండ‌ల ప‌రిధిలోని వ‌ట్టేం గ్రామంలో అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ పి. శరత్ చంద్ర రెడ్డిల సహకారంతో 1కోటి 50 లక్షలతో కొత్త ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి

విద్యార్థుల కోసం అత్యాధునిక వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
X

దిశ‌, బిజినెప‌ల్లి : మండ‌ల ప‌రిధిలోని వ‌ట్టేం గ్రామంలో అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ పి. శరత్ చంద్ర రెడ్డిల సహకారంతో 1కోటి 50 లక్షలతో కొత్త ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల కోసం అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ పాఠశాల అభివృద్ధి పై సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభ్యున్నతికి మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్య అందించేందుకు గ్రామాల్లో విద్యా వసతుల అభివృద్ధి అత్యంత అవసరం అన్నారు. పిల్లల భవిష్యత్తును వెలుగొందించడానికి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ పాఠశాల ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో విద్యార్థులకు పాఠశాల గదులను అప్పజెప్పినందుకు సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాలకు కూచుకుళ్ల ఫౌండేషన్ ద్వారా గ్రీన్ బోర్డ్స్ అందించారు. గ్రామ అభివృద్ధి, విద్యాభివృద్ధి పట్ల తమ కృతనిశ్చయం కొనసాగుతుందని, మరిన్ని అభివృద్ధి పనులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఈ పాఠశాల నిర్మాణానికి సహకరించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు క్రీడాలకు సంబంధించిన ఆట వస్తువులు కావాలంటే మాకు ఎస్టిమేషన్ వేసి పంపాలని ఈ సందర్భంగా హెచ్ఎం కు సూచించారు. పాఠశాలలోని ఒక విద్యార్థికి బట్టలు సరిపోకపోవడంతో మార్కెట్ చైర్మన్ ఎంఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్రస్సులు అప్పజెప్తే నిర్రక్ష వైఖరి వహిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వతంత్ర భారత రూపశిల్పి, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కటింగ్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి మాజీ ఎంపిటిసి తిరుపతి రెడ్డి, నాగర్ కర్నూల్ మార్కెట్ డైరెక్టర్ నజీర్ ,భగవంతుగౌడ్, నరేందర్ రెడ్డి, రాగి మధుసూదన్ రెడ్డి, గంగనమోని తిరుపతయ్య ,మాజీ పిఎస్సి చైర్మన్ వెంకటస్వామి, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story