- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్డోజర్లతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తా: రాజాసింగ్
గెలిచిన వెంటనే బుల్డోజర్ తో కేసీఆర్ ఫామ్‌హౌస్, కేటీఆర్ ఇంటికి వెళ్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, అమరచింత: గెలిచిన వెంటనే బుల్డోజర్ తో కేసీఆర్ ఫామ్‌హౌస్, కేటీఆర్ ఇంటికి వెళ్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన అవినీతి చేసి సంపాదించిన ప్రతి ఎమ్మెల్యే, అదే విదంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇండ్లలకు ఫామ్‌హౌస్‌లకు ప్రజల పక్షాన బుల్డోజర్లతో వెళ్లి, అవినీతి సొమ్మును తవ్వి తీస్తానని అన్నారు. కేటీఆర్ నేను ఒడిపోతానని చెబుతున్నారని, నన్ను ఓడ గొట్టేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారని, ఎంత ఖర్చు పెట్టిన నా గెలుపు ఆపలేరన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగలతో పాటు ఎంఐఎం దొంగలు ఒక్కటయ్యారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ మద్యం తెలంగాణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులలో అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఇప్పుడు మీ దగ్గరికి అదే డబ్బుతో వస్తున్నారు. వారిని నమ్మకండి.. జాగ్రత్తగా ఉండండి.. వారి మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకండి. మక్తల్ బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కే మీ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్తల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, కర్ణాటక కోలార్ ఎంపీ మునిస్వామి, స్థానిక నేతలు మహంకాళి శ్రీను, క్యామ భాస్కర్, మెర్వ రాజు, అశోక్, నారాయణ, మంగ లావణ్య లతో పాటుగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






