- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఒక ఐపీఎస్ అధికారి నీ కులం పేరుతో దుషిణచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మిడ్జీల్ ఉమ్మడి మండల తెలంగాణ జేఏసీ కన్వీనర్ మామిడి మాడ భాస్కర్ పేర్కొన్నారు.

దిశ, జడ్చర్ల : ఒక ఐపీఎస్ అధికారి నీ కులం పేరుతో దుషిణచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మిడ్జీల్ ఉమ్మడి మండల తెలంగాణ జేఏసీ కన్వీనర్ మామిడి మాడ భాస్కర్ పేర్కొన్నారు. వెంటనే అధికారికి హుజురాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని.. లేని యెడల ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తదని తెలిపారు. ఒక రాజ్యంగ బద్ధమైన పదవీ లో ఉన్న అధికారిని దూషించడం తప్పు అని సమాజానికి మీరు నేర్పించేది ఇదేనా..? ప్రజల ఓట్లతో గెలిచి మీరు రౌడీల మాదిరిగా రోడ్ల మీద మీరు చేసే క్రీడలు యువత ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరు ఆ పదవీని మీ సొంత అవసరాల కోసం వాడుకోవడం సరైంది కాదన్నారు. అందరినీ సమానంగా గౌరవించాలి.. చేత కాక పోతే ప్రజాలు ఇచ్చిన పదవికి రాజీనామా చేయాలని హితవు పలికారు. వెంటనే ఐపీఎస్ అధికారికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.






