గ్రామ పంచాయతీలకు పునరుజ్జీవం పోద్దాం

by velandi.Saikiran |

బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలకు పునర్జీవం పొసేందుకు సిద్ధం కావాల‌ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అ

గ్రామ పంచాయతీలకు పునరుజ్జీవం పోద్దాం
X

దిశ,వనపర్తి: బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలకు పునర్జీవం పొసేందుకు సిద్ధం కావాల‌ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే మేఘారెడ్డి తన నివాస కార్యాలయంలో పెద్దమందడి, గోపాల్పేట,రేవల్లి,ఖిల్లా ఘణపురం, ఏదుల మండలాలకు చెందిన సర్పంచులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీ.ఆర్.ఎస్ పాలనలో గ్రామాలన్ని నిర్వీర్యం అయిపోయాయని, ఎందరో సర్పంచులు అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకున్న ఉద్ధాంతాలు ఎన్నో ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ ఎస్ పాల‌న‌లో సర్పంచుల ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమైన నాయకులు, మళ్ళీ నిస్సిగ్గుగా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పదేళ్లు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. బీ.ఆర్.ఎస్ పార్టీ మునిగిపోయే పడవలో ఎవరు ప్రయాణం చేయకూడదన్నారు. స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి వలన బీ.ఆర్.ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పారన్నారు. కాంగ్రెస్ మద్దతుతో విజయ్ సాధించిన సర్పంచులు వార్డు సభ్యులు ఉపసర్పంచులు ప్రతి ఒక్కరు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.

Next Story