- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా అభ్యున్నతే ప్రభుత్వం లక్ష్యం
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. శు

దిశ, వనపర్తి: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి పెద్దమందడి జగత్ పల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళలలకు ఉచిత చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు 89 వేల పైచిలుకు చీరలు వచ్చాయని, మున్సిపాలిటీలకు మరో 40 వేల చీరలు వస్తాయని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ. 5 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య భవనం నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. రాజనగరం నుండి పెద్దమందడి వరకు రూ. 40 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన రెండు వరుసల రోడ్డుకు జిల్లా కలెక్టర్ తో కలిసి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ, తహసిల్దార్ పాండు ఎంపీడీవో పరిణత, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టన్న, వెంకటస్వామి, ఐ. సత్యా రెడ్డి, రఘు ప్రసాద్, ఎ పి.యం సక్రూ నాయక్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






