- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : ఎమ్మెల్యే కృష్ణ మెహన్ రెడ్డి
దిశ, గట్టు : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

దిశ, గట్టు : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నియోజకవర్గంలో ని గట్టు మండల కేంద్రంలో మండల స్థాయిలో నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 09న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని.. గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికలలో తన గెలుపు కోసం కృషి చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీ ఎన్నికలు స్థానిక సమస్య ఎన్నికలు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే విధంగా వారి గ్రామాల రిజర్వేషన్లు అనుకూలంగా స్థానిక నాయకత్వం బట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచుల అభ్యర్థులను గెలిపించి భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.






