- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన సహకార సంఘం ఏర్పాటుకు ఎమ్మెల్యే లేఖను కలెక్టర్ కి అందజేత
నూతన సహకార సంఘం ఏర్పాటుకు ఎమ్మెల్యే లేఖను కలెక్టర్ కి అందజేశారు మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ.

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేంద్ర బోయి ని మర్యాదపూర్వకంగా కలసి, మహమ్మదాబాద్ మండలానికి నూతన వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలంటూ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖను కలెక్టర్‌కు అందజేశారు. ఉమ్మడి గండీడ్ మండల పరిధిలో కొనసాగుతున్న వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాన్ని గండీడ్ మండలం నుంచి విడదీసి మహమ్మదాబాద్ మండలానికి ప్రత్యేకంగా సహకార సంఘం ఏర్పాటు చేస్తే.. రైతులకు రుణాలు, బ్యాంకింగ్ సదుపాయాలు సులభంగా అందుతాయని కలెక్టర్‌కు వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జి. లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు జే. వీరాజీ పాల్గొన్నారు.






