చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

by Kodari Anjali |

కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్ల చెన్నకేశవులు ఇటీవల మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చనిపోయిన నివాసానికి వెళ్లి కుటుంబీకులను సంతాపం తెలిపారు.

చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే
X

దిశ, తిమ్మాజీపేట: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్ల చెన్నకేశవులు ఇటీవల మృతి చెందడం పట్ల మంగళవారం రోజు మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చనిపోయిన నివాసానికి వెళ్లి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేన్నకేశవులు కుటుంబ సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చెన్నకేశవులు సేవలను స్మరించుకుంటూ, ఆయన లేని లోటు పార్టీకి మరియు కుటుంబానికి తీరనిలోటూ అని తెలిపారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ మరణించిన కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గుమ్మకుండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూడి హర్షవర్ధన్ రెడ్డి తల్లి శ్రీమతి సుశీలమ్మ మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాల్గొని భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి, ధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story