- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ నాయకుడి పట్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిబద్ధత
తననే దైవంగా భావిస్తూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి శాసనసభ ఎన్నికల్లో తనకోసం విశేషంగా కృషి చేసిన పార్టీ నాయకుడి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు.

దిశ, నవాబుపేట : తననే దైవంగా భావిస్తూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి శాసనసభ ఎన్నికల్లో తనకోసం విశేషంగా కృషి చేసిన పార్టీ నాయకుడి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. గురువారం సంక్రాంతి పర్వదినం సంబరాలను తన కుటుంబ సభ్యులతో, తన శ్రేయోభిలాషులతో గడుపుకోవాల్సిన ఆయన తన కోసం ఎన్నికలలో అవిశ్రాంతంగా శ్రమించిన పార్టీ నాయకుడు ఇక లేడని తెలిసిన వెంటనే అన్నింటిని పక్కనపెట్టి హుటాహుటిన హైదరాబాద్ నగరం నుంచి నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు గ్రామానికి చేరుకున్నారు. తాను గ్రామ ఇప్పటూరు గ్రామ సర్పంచిగా, తమ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాష్ట్రమంత్రి కావాలని తన ద్వేయంగా పెట్టుకున్న ఆ గ్రామ ఉప సర్పంచ్ బెస్త సూరి అలియాస్ గుర్రపు సూరి తన ధ్యేయం నెరవేరక ముందే ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందాడనే విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమాని సూరి పార్టీవదేహంపై పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి సంబంధించిన విషయాలను గురించి కుటుంబ సభ్యులను గ్రామస్తులను అడిగి తెలుసుకుని ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సూరి మృతి కాంగ్రెస్ పార్టీకి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. పండుగను సైతం పక్కనపెట్టి తన అభిమాని కోసం ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని నివాళులు అర్పించడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటానని భరోసాను ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఆయన పట్ల మరింత విశ్వాసం పెంపొందింది.






