సొంతిల్లు ప్రతి ఒక్కరికీ ఓ భరోసా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : సొంతిల్లు ఓ భరోసా మనకంటూ ఓ గూడు ఉంటే ఆ నీడన కారం, రొట్టె తిన్నా కూడా తృప్తిగా ఉంటుందని.. అసంతృప్తి అనేదే ఉండదని గట్టి నమ్మకం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.

సొంతిల్లు ప్రతి ఒక్కరికీ ఓ భరోసా :  ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : సొంతిల్లు ఓ భరోసా మనకంటూ ఓ గూడు ఉంటే ఆ నీడన కారం, రొట్టె తిన్నా కూడా తృప్తిగా ఉంటుందని.. అసంతృప్తి అనేదే ఉండదని గట్టి నమ్మకం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన బాలు, బుజ్జి దంపతుల్లో సంబురం కనబడుతోందని తెలిపారు. శనివారం జడ్చర్ల మండల పరిధిలోని శంకరయ్య పల్లి తండా లో బాలు, బుజ్జి దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లును తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉంద‌న్నారు. అనంతరం బాలు బుజ్జి దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. వారితో కలసి భోజనం చేశారు. సొంత చెల్లెలు ఇంటి గృహ ప్రవేశానికి వచ్చిన ఆనందం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మిగతా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని అన్నారు. అనంతరం గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చెర్మెన్, పుష్పాలత, కౌన్సిలర్ చైతన్య చౌహన్, రమేష్, రహీం, కాంగ్రెస్ నాయకులు అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story