భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత పాలకమండలిదే: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

by Kodari Anjali |

ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత పాలకమండలిదే: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
X

దిశ, ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయస్వామి వారి ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా పాలకమండలి నూతనంగా ఏర్పాటు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని, ధర్మకర్తల మండలి భక్తులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని అన్నారు. దాంతో పాటు భక్తులకు భద్రత విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. సన్మానించిన వారిలో ఆలయ చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి, సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయూబ్ పాషా, తదితరులు ఉన్నారు.

Next Story