- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా రంజాన్ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే ఆల
కొత్తకోట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు.

దిశ, కొత్తకోట: కొత్తకోట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సాకబాల నారాయణ, గాడీల ప్రశాంత్, కాజా మైనద్దీన్, పద్మ అయ్యన్న, వసీం ఖాన్, లతీఫ్, షేక్ వహీద్, పాష, మిషేక్, కొండారెడ్డి, సంధ్యా రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎరుకలి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.






