ఉద్యోగం కోసం వెళ్లిన యువ‌తి అదృశ్యం

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ లో జాబ్ దొరికింది .. ఫ్రెండ్స్ తో ఉండి జాబ్ చేస్తానని వెళ్లిన అమ్మాయి మిస్సింగ్ అయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.

ఉద్యోగం కోసం వెళ్లిన యువ‌తి అదృశ్యం
X

దిశ, ఊట్కూర్ : మహబూబ్ నగర్ లో జాబ్ దొరికింది .. ఫ్రెండ్స్ తో ఉండి జాబ్ చేస్తానని వెళ్లిన అమ్మాయి మిస్సింగ్ అయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం .. మండల పరిధిలోని పెద్ద పొర్ల గ్రామానికి చెందిన వెంకటయ్య కూతురు ( 21 )డిగ్రీ పూర్తి చేసి గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేది. ఈ నెల 15 న 10:30 గంటల సమయంలో నాకు మహబూబ్ నగర్ లో జాబు వచ్చింది. మా ఫ్రెండ్స్ తో కలిసి జాబు చేస్తానని ఇంటి నుండి బయలుదేరింది. కానీ ఆమె ఫ్రెండ్స్ దగ్గరికి చేరలేదు. అలాగే ఇంటికి చేరకపోవడంతో తెలిసిన బంధువుల ఇళ్లలో కూతురు ఆచూకి కోసం తండ్రి వెతికినప్పటికీ ఆచూకీ దొరకకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. మిస్సింగ్ అయిన అమ్మాయి పింక్ కలరు పంజాబీ డ్రెస్, ఎత్తు అంజదా 5.1 ఉండి.. చామన చాయ రంగులో ఉంటుందన్నారు. అమ్మాయి ఆచూకీ తెలిసినవారు ఊట్కూర్ పోలీసుల‌ను సంప్రదించాలని 871 2670412 ఎస్ఐ రమేష్ తెలిపారు.

Next Story