- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమశిల ఎకో పార్క్ ను ప్రారంభించిన మంత్రులు
సోమశిల ఏకో పార్క్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ,మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు.

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ రేంజ్ పరిధిలో సోమశిల ఏకో పార్క్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఇక్కడనే సఫారీ వాహనాలను జెండాను ఊపి ప్రారంభించారు. అక్కడి నుండి ఏకో పార్క్యూ పాయింట్ సందర్శించి అడవి ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం రాత్రి కొల్లాపూర్ పట్టణంలోనీ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునీకరణ భవన సముదాన్ని మంత్రులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర , డివిజనల్ ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ ఛైర్మన్ రహీం పాషా,డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, ఆర్డీఓ బన్సీలాల్, సోమశిల సర్పంచ్ కాటం వెంకట లక్ష్మి, ఫారెస్ట్ రేంజ్ లు వాణి కుమారి, ఈశ్వర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుబ్బుర్, కాషాన్న, ముజీబ్ ఘోరి, శ్యామ్, నాగార్జున, కిరణ్, నవీన్, రామాంజన్, బయన్న, నీలేష్, లిఖిత, శివ ఉన్నతాధికారులు ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.






