- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు అచ్చంపేటకు మంత్రి వాకిటి శ్రీహరి రాక
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించి పలు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనందుకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రివర్యులు వాకిటి శ్రీహరి పర్యటిస్తున్నారని మంత్రి కార్యాలయం నుంచి వెలువడిన పర్యటన షెడ్యూల్డ్ బుధవారం మీడియాకు విడుదల చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు మినిస్టర్ కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు అచ్చంపేట పట్టణానికి చేరుకుంటారు. 12వ వార్డులో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ, 13 వ వార్డులో శనగకుంట మరమ్మతుల పనులకు శ్రీకారం, 14వ వార్డులో ల్యాండ్ స్కేపింగ్, లైటింగ్, కాంపౌండ్ వాల్, మూడో వార్డులో వైఎస్ఆర్ పార్కులు శంకుస్థాపన భూమి పూజ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాల్గొనున్నారు.






