- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ..!

దిశ, ఊట్కూర్/ మక్తల్ : కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ లో ఊట్కూర్ ను క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయడానికి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పై నాయకులు వాగ్దానాలు చేసినప్పటి నుంచి ఊట్కూర్ రైల్వే స్టేషన్ చేయాలని.. లేదంటే క్రాసింగ్ లైన్ లో స్టేషన్ ఉండాలని ఊట్కూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అని వివరించారు. అలాగే భేసేకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే రూ.438 కోట్లు కేటాచించిందని మేనేజర్ తో చెప్పారు. 122 కిలోమీటర్లు రైల్వే లైన్ లో కృష్ణా-మక్తల్-నారాయణపేట- దామర్గిద్ద-బలంపేట-దౌల్తాబాద్-కొడంగల్-పరిగి-వికారాబాద్ అలైన్‌మెంట్ భాగంగా ఉట్కూర్ స్టేషన్లలో ఒకటిగా గుర్తించబడింది. దీనిని క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల స్థానికంగా 30 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని జీవనోపాధి కోసం నగరాలకు వెళ్లి రావడానికి వీలుగా ఉంటుందని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉట్కూర్ రైల్వే స్టేషను క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం కోట్ల ఉదయ్ నాథ్, రైల్వే సెక్రటరీ శ్రీనివాస్, ఉట్కూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి, శివ పాల్గొన్నారు.






