సనాతన ధర్మం.. గొప్ప మ‌న‌సు చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

by velandi.Saikiran |

యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణం కోసం చ‌ర్య‌లు తీసుకున్నారు మంత్రి వాకిటి శ్రీహరి.

సనాతన ధర్మం.. గొప్ప మ‌న‌సు చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, మక్తల్ : సనాతన ధర్మంపై ఎన్నిదాడులు జరిగినా విజయం ధర్మానిదే అని ఉడిపి పేజవర మఠదీశ్వరులు శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వాముల అన్నారు. మక్తల్ పట్టణంలో శుక్రవారం రోజు 9 గంటల ప్రాంతంలో ధర్మ విజయ యాత్ర లో భాగంగా కుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామికి ప్రత్యేక మంగళారతులు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వామి దర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలం ఇప్పించాలని మంత్రిని పేజావర మఠం స్వామి కోరారు. దీంతో వెంట‌నే స్పందించిన మంత్రి వాకిటి, స్థానిక ఎమ్మెల్యే ఐలయ్యతో మాట్లాడి, అక్కడ వేద పాఠశాల నిర్మాణం కోసం స్థలం ఇచ్చేందుకు హామీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే .అరుణ . మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గోన్నారు.

Next Story