- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో రైతుల ఖాతాలో ధాన్యం బోనస్ : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : త్వరలోనే రైతుల ఖాతాలోకి ధాన్యంకి సంబంధించిన బోనస్ వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి

దిశ, మక్తల్ : త్వరలోనే రైతుల ఖాతాలోకి ధాన్యంకి సంబంధించిన బోనస్ వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కృష్ణ, మాగనూర్ మండలానికి చెందిన రైతులు బోనస్ పై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయానికి రైతులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన సన్నధాన్యం క్వింటాలుకు ఐదువందల బోనస్ త్వరలో రైతులకు ఖాతాలో జమ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సన్నరకం పండించిన రైతులకు మద్దతు ధర ఇచ్చి వారి నుంచి ధాన్యం సేకరించిందని రైతులు నష్టపోకుండా అధనపుగా బోనస్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వ పాలసి కావడం వల్లా త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయానికి అనుగుణంగా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమచేసే చేస్తామని మంత్రి వాటికి శ్రీహరి రైతులందరికీ హమి ఇచ్చారు.
అలాగే ఇటీవల ఎడతేరిపి లేకుండా కురిసిన అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సంబంధిత రెవెన్యూ వ్యవసాయ.అదికారులతో సర్వే చేయించి నివేదిక ప్రకారం.. రైతులను ఆదుకోంటామని .తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులను అన్ని విదాలుగా ఆదుకోవడమే లక్ష్యం గా పనిచేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. కార్యక్రమంలో మాగనూరు, కృష్ణ మండలాల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






