- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి ఎందుకు చేయలేదు..? : మంత్రి జూపల్లి
దిశ, వనపర్తి: పదేళ్లుగా రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్ట్ ని ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు

దిశ, వనపర్తి: పదేళ్లుగా రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్ట్ ని ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం, డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనరెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం ర్యాలీగా బయలుదేరారు. అంబేద్కర్, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు పాలమూరు గోసలను పరిస్థితులను కళ్ళ కట్టినట్లు పార్లమెంటు ముందు పెట్టి,ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన అనంతరం పాలమూరు ప్రజలకు చేసిన మేలు ఏమి లేదని ఆయన అన్నారు. పదేళ్ల కాలంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయని దుస్థితి దాపరించినప్పటికీ నార్లాపూర్ వద్ద ఉన్న పంప్ హౌస్ ను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేసినట్లు కితాబిచ్చావ్. అబద్దాలు చెప్పారని అని కేసీఆర్ పై మండిపడ్డారు.
ప్రాజెక్ట్ రూపకల్పన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారని గుర్తు చేశారు. బీజేపీతో అంతర్గత సంబంధాలు పెట్టుకుని పరిపాలన చేశారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సక్రమంగా డీపీఆర్ గాని, పర్యావరణ అనుమతులు లేవన్నారు. పాలమూరు ప్రజలపై నీకు ప్రేమ ఉంటే 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయామని ప్రశ్నించారు. 64 సంవత్సరాల లో 22 మంది ముఖ్యమంత్రి మారిన.. 65 వేల కోట్లు అప్పు చేస్తే.. పదేళ్ల కాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. చేసిన అప్పులకు ఇప్పటికే 6000 కోట్లు మిత్తి కడుతున్నామని గుర్తు చేశారు. రైతు భరోసా కోసం రింగ్ రోడ్డులను అమ్మిన నీచమైన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఉంటే కాంగ్రెస్ పార్టీ అందనంత ఎత్తులో నిలబెడుతుంది అని పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పదవులు ఆశించినప్పుడు బదులు రావని... పార్టీ కోసం నిలబడి పనిచేసినప్పుడే పదవులు వాటి అంతకు అవే వస్తాయి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఉన్నప్పటికీ మంచివి చూడాలి గానీ, చెడును స్వీకరించొద్దన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై పార్టీ కోసం పనిచేయాలని.. రానున్న ఎన్నికల్లో పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
నికార్సైన ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకుంటా అని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. గతం లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేయని ఏ ఒక్కరిని క్షమించే ప్రసక్తి లేదు. ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లు ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారని అంతర్గతంగా నివేదికలు తీసుకుంటాం పనిచేయని వారిని తొలగిస్తానని, పనిచేయని కార్యకర్తలను ఆయన హెచ్చరించారు. ఇప్పటినుంచి అయినా సక్రమంగా పనిచేసే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం పాటు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనా సంకల్ప బలంతో పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటినుంచి రికమండేషన్స్ ఉండవన్నారు. పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడమే కాంగ్రెస్ అజెండా అన్నారు. టీపీసీసీ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషిచేసిన.. నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పేదల కోసం పనిచేశారని, అలా పనిచేయడం వల్లనే ఇప్పటికీ వారు పేదల గుండెల్లో ఉన్నారన్నారు.
పేదలకు చేసే పని తృప్తినిస్తుందని కొనియాడారు. రాహుల్ గాంధీ చేసిన జోడోయాత్ర ఇంతగానో ఉపయోగపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలపై పార్లమెంటులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంఘటన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట కోసం పనిచేస్తుందని... స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న దురదృష్టితో పనిచేసిందన్నారు. కొందరు అడ్డుకోవడం వల్ల కోర్టులో చిక్కు ఎదురైందని గుర్తు చేశారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి బడుగు బలహీన వర్గాలకోసంపనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, టీపీసీసీ పార్లమెంట్ పరిశీలికులు సంధ్యారెడ్డి, టీపీసీసీ నందిమల్ల యాదయ్య, పీసీసీ డేటిగేట్ శంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు రాజేందర్ ప్రసాద్ యాదవ్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మీ, నందిమల్ల, చంద్రమౌళి,నక్క రవికిరణ్ బాబా పాల్గొన్నారు.






