అపర భద్రాద్రిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్రంలో రెండో భద్రాద్రి గా పేరొందిన సిర‌స‌న‌గండ్ల‌ శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

అపర భద్రాద్రిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తాం :  మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
X

దిశ, చారకొండ : తెలంగాణ రాష్ట్రంలో రెండో భద్రాద్రి గా పేరొందిన సిర‌స‌న‌గండ్ల‌ శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండల పరిధిలోని సిర‌స‌న‌గండ్ల‌ శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు .ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలుకారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. ఆలయ దిగువ పరిసరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే కాలంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు, దేవాలయ పరిసరాలను సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో సునిత, ఆలయ చైర్మన్ రామ శర్మ , ఈవో స్వర్గం ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండె వెంకట్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు బాల్ రాం గౌడ్, సర్పంచ్ లు రామస్వామి, బోడి, పోలీసు అధికారులు, దేవాలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Next Story