- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లాపూర్ లో దివంగత సీపీఐ నేత సురవరం కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా :
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ప్రాంతంలో జన్మించి జాతీయ స్థాయిలో పేరుగాంచిన భారతదేశం గర్వించదగిన బిడ్డ దివంగత సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కాంస్య

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ ప్రాంతంలో జన్మించి జాతీయ స్థాయిలో పేరుగాంచిన భారతదేశం గర్వించదగిన బిడ్డ దివంగత సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కాంస్య విగ్రహన్ని కొల్లాపూర్ లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.సురవరం జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే నేపథ్యంతో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆయన జీవిత చరిత్ర ను పుస్తకాల రూపంలో ముద్రించి గ్రామాలల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దివంగత సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బుధవారం కొల్లాపూర్ లో ఓ పంక్షన్ హల్ లో వద్ధి రాంరెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. వద్ది రాం రెడ్డి మనుమడు నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ సురవరం కొల్లాపూర్ బిడ్డని, కమ్యూనిస్ట్ సిద్దాంతం ప్రకారం.. ఆర్థిక కంగా సామాజికంగా సమ, సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. సురవరం ఆలోచన ఆశయాలు నెరవేర్చాలంటే వారి లక్ష్యాన్ని పునికి పుచ్చుకొని నెరవేర్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. 60 సంవత్సరాలుగా తాను నమ్మే సిద్ధాంతం కోసం రాజీ పడకుండా పోరాటం చేసిన సురవరం గొప్పతనాన్ని గూర్చి మంత్రి కొనియాడారు.
సురవరం మొహంలో కోపాన్ని ఎప్పుడు చూడ లేదన్నారు. సురవరం చాలా గొప్ప సంస్కారవంతులన్నారు. భారతదేశానికి సురవరాన్ని అందించిన తల్లిదండ్రులు గొప్ప వంతులని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. సురవరం ఆలోచన విధానాన్ని వంట పట్టించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సంపాదనే ధ్యేయం కాదన్నారు. చేయాలన్న తపన ప్రతి మనిషికి ఉండాలన్నారు సురవరం జీవితాన్ని స్వార్థం చేసుకుని, ఆయన ఆలోచన విధానాన్ని స్ఫూర్తి గా తీసుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. చదువంటే హోదా కాదని, చదువు సంస్కారాన్ని నేర్పుతుందన్నారు. సురవరం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని త్యాగం చేశారని, గొప్ప వారిని స్మరించుకోవడం ద్వారా రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాలిక వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ, పార్టీ రాష్ట్ర నాయకురాలు ఛాయాదేవి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, సురవరం విజయలక్ష్మి, ఆమె తనయుడు సురవరం కపిల్, సురవరం చెల్లెలు పుష్పలత, సమన్వయకర్త కందాల రామకృష్ణ, లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు పాల్గొన్నారు.






