ఎన్ఆర్ఐ బాలాత్రిపురసుందరి ని సన్మానించిన మిడ్జిల్ బీజేపీ నాయకులు

by Web Desk |
ఎన్ఆర్ఐ బాలాత్రిపురసుందరి ని సన్మానించిన మిడ్జిల్ బీజేపీ నాయకులు
X

దిశ, జడ్చర్ల: మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి నివాసంలో నూతనంగా పార్టీలో చేరిన జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ బాలాత్రిపురసుందరిని మిడ్జిల్ మండల బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి.. పార్టీలో చేరిన శుభ సందర్భంగా ఆమె ను జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐ బాలా త్రిపుర సుందరి బీజేపీలో చేరడం శుభ పరిణామమన్నారు.

పార్టీని అధికారంలోకి రావడం కోసం పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయ పరుచుకుని ముందుకు సాగాలన్నారు. పార్టీపరంగా ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లాలో అధికారమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మిడ్జిల్ మండలం వైస్ ఎంపీపీ తిరుపతమ్మ రవీందర్ గౌడ్, మిడ్జిల్ మండలం ఓ బి సి అధ్యక్షుడు మహేంద్ర చారి ,బీజేపీ నాయకులు రామ్మోహన్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed