'జ‌డ్చ‌ర్ల అభివృద్ధే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ల‌క్ష్యం'

by Ratna Kumari |

దిశ‌, జ‌డ్చ‌ర్ల : జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని బాదేప‌ల్లి మార్కెట్ క‌మిటీ వైస్ చైర్మ‌న్ రాజు గౌడ్, స‌ర్పంచ్ సుజాత గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

జ‌డ్చ‌ర్ల అభివృద్ధే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ల‌క్ష్యం
X

దిశ‌, జ‌డ్చ‌ర్ల : జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని బాదేప‌ల్లి మార్కెట్ క‌మిటీ వైస్ చైర్మ‌న్ రాజు గౌడ్, స‌ర్పంచ్ సుజాత గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మండ‌ల ప‌రిధిలోని కిష్టారం గ్రామంలో స‌ర్పంచ్ సుజాత గోపాల్ ఆధ్వ‌ర్యంలో ఎస్వీఎస్ మెడిక‌ల్ క‌ళాశాల వారి సౌజ‌న్యంతో ఉచిత వైద్య శిబిరం, ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కొరకై పాటుపడుతూ అహర్నిశలు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. అలాగే తలసేన్య బాధితుల కొరకై రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని మరింత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యల తెలుసుకొని మెరుగైన వైద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. జడ్చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూర్ల వెంకటయ్య, కిష్టారం ఉపసర్పంచ్ బాలరాజ్, నాయకులు కేశవులు, కృష్ణారెడ్డి, చిరంజీవి, శ్రీశైలం, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story