ఎండి జాహంగీర్ మృతి బాధాకరం : ఎమ్మెల్యే బాలు నాయక్

by Nallavelli.Anjaneyulu |

దిశ, చింతపల్లి : చింతపల్లి గ్రామానికి చెందిన ఎం.డీ. జాహంగీర్ శుక్రవారం

ఎండి జాహంగీర్ మృతి బాధాకరం : ఎమ్మెల్యే బాలు నాయక్
X

దిశ, చింతపల్లి : చింతపల్లి గ్రామానికి చెందిన ఎం.డీ. జాహంగీర్ శుక్రవారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందిన విషాద వార్త తెలిసిన వెంటనే దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చింతపల్లి గ్రామానికి వెళ్లి మరణించిన జాంగీర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖసమయంలో ధైర్యం చెప్పి, వారికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ఆకస్మికంగా కుటుంబ సభ్యుణ్ని కోల్పోవడం చాలా బాధాకరమని, ఈ కష్టమైన సమయంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఓ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయనతోపాటు పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ ముచర్ల గిరి, ఉప సర్పంచ్ సలీమ్, మాజీ ఎంపీటీసీ శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు రవి, కో-ఆప్షన్ సభ్యులు జాహంగీర్, రియాజ్, వార్డు సభ్యులు సిద్దిక్ బాబా ఉన్నారు.

Next Story