- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లా దీవెనలతో సకల శుభాలు కలగాలి
అల్లా దీవెనలతో అందరికీ సకల శుభాలు కలగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అల్లా దీవెనలతో అందరికీ సకల శుభాలు కలగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన వారిని కలసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. క్రమశిక్షణ,ధార్మిక చింతన కలయికనే రంజాన్ మాసం విశిష్టతని,మనిషిలోని చెడు భావాన్ని,అధర్మాన్ని,ద్వేషాలను రూపుమాపే గొప్ప పండగ రంజాన్ అని ఆయన అన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని,ఆయన దీవెనలు మనందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి ప్రత్యేక ఆహ్వానీతులు చల్లా వంశీచంద్ రెడ్డి,మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,టిపీసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,వినోద్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేష్,పార్టీ నాయకులు మిథున్ రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్,సిరాజ్ ఖాద్రీ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్,సిజె బెనహార్,అవేజ్,ఏర్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






