- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్య్స సహకార ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర కోపరేటివ్ ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్టర్ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, ధన్వాడ : ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర కోపరేటివ్ ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్టర్ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో మత్స్య సహకార సొసైటీ రద్దయింది. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ జరగలేదు. ఈ సొసైటీలో 4 21 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకొనున్నారు. ఈ డైరెక్టర్లలోనే ఒకరు చైర్మన్ వైస్ చైర్మన్ కోశాధికారిని ఎన్నుకోనున్నారు. గతంలో ఏకగ్రీవంతో సొసైటీ చైర్మన్ ను ఎన్నుకుంటూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఏకగ్రీవమా..? ఎన్నికలా..? అని తెలియని పరిస్థితి నెలకొంది.
మత్స్య సహకార సొసైటీలో కొంతమంది చైర్మన్ పదవినీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని వల్ల ఏకగ్రీవంగా ఎన్నికలే జరగవచ్చని చర్చ మొదలైంది. నీరటీ నరసింహనాయుడు చైర్మన్ గా కొనసాగర్ ప్రస్తుతం మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నరసింహనాయుడు కొనసాగుతున్నారు. నరసింహనాయుడు మళ్ళీ చైర్మన్ పదవీని ఆశిస్తున్నారు. అందరి సహకారంతో ఈ సారి కూడా తననే చైర్మన్ గా ఎన్నుకోవాలని సహకార సంఘం నాయకులను కోరుతున్నట్లు తెలిసింది. ఈ సొసైటీ లోనే మరో ఇద్దరు ముగ్గురు పదవీని ఆశిస్తూ ఎలాగైనా చైర్మన్ పదవీని దక్కించుకోవాలని తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. జిల్లా కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆంజనేయులు ఎన్నికల నిర్వహణ ఇన్ చార్జిగా నియమించారు. ఈనెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 6 నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరించి 11న పరిశీలన, ఉపసంహరణ.. అభ్యర్థుల ప్రకటన 12న గుర్తుల కేటాయింపు జరగనుందని అధికారులు తెలిపారు. 16 న ఎన్నికల నిర్వహణ జరపడానికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ కావడంతో సొసైటీ చైర్మన్ పదవి చర్చ ప్రారంభమైంది 9 మంది డైరెక్టర్లను ఎన్నుకున్న చైర్మన్ ను ఎన్నుకుంటారు ఇందులో ఇద్దరు మహిళ డైరెక్టర్లను సైతం ఎన్నుకోవాల్సి ఉంటుంది చైర్మన్ కన్నా ముందుగా డైరెక్టర్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
చైర్మన్ బరిలో ఉంటాను : నీరటి నరసింహనాయుడు
ధన్వాడ మత్స్య కార్మిక సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లగా సానుకూలంగా తీర్పు రావడం తిరిగింది ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేశారు. సొసైటీ చైర్మన్ కి ఈసారి సైతం పోటీలో ఉంటాను సొసైటీని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతాను.






