చేనేత సమస్యలపై భారీ నిరసన

by Ratna Kumari |

దిశ, రాజోలి : రాజోలి మండల పరిధిలో బుధవారం చేనేత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పై జరుగుతున్న జాప్యానికి చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.

చేనేత సమస్యలపై భారీ నిరసన
X

దిశ, రాజోలి : రాజోలి మండల పరిధిలో బుధవారం చేనేత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పై జరుగుతున్న జాప్యానికి చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చేనేత రుణమాఫీని తక్షణం అమలు చేయాలని, చేనేత భరోసా పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా త్వరగా అందించాలని, బ్యాంకుల ద్వారా ఐదు లక్షల రూపాయల లోపు రుణాలు మంజూరు చేయాలని కార్మికులు కోరారు. అలాగే చేనేత కళాకారులు మరణించినప్పుడు చేనేత బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఆలస్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్తగా ప్రవేశపెట్టిన జియో ట్యాగింగ్ ఆర్డీ మరియు ఇతర పథకాలు అందే విధంగా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఇక గుంత మగ్గాల ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు చేరడం వల్ల పని చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వర్క్ షెడ్‌లు మరియు గృహ నిర్మాణాలు తక్షణమే చేపట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, రాజోలి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు దోత్రి శీనివాసులు, సహకార సంఘం ఉపాధ్యక్షుడు అచ్చుగట్ల మాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి చేనేత కార్మికులు, స్థానికులు హాజరయ్యారు.

Next Story