సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు : డీఐజీ ఎల్ఎస్ చౌహాన్

by Nallavelli.Anjaneyulu |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జిల్లా పర్యటన సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహన్ తెలిపారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు  :   డీఐజీ ఎల్ఎస్ చౌహాన్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జిల్లా పర్యటన సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహన్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఏఎస్ఎన్ గార్డెన్ లో బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేసిన 1184 మంది పోలీస్ అధికారులు, తదితర సిబ్బంది కి సమగ్ర సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి గ్రామంలో ఐఐఐటీ కళాశాల భూమి పూజ లో కార్యక్రమం ముగించుకుని జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్ పల్లి లోని ఎంవీఎస్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నట్లు డిఐజీ తెలిపారు. ఇట్టి కార్యక్రమాలలో పాల్గొనే ముఖ్యమంత్రి రాక సజావుగా జరిగేలా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శంకుస్థాపన ప్రాంగణం, బహిరంగ సభ ప్రాంగణం, ప్రయాణ మార్గాలు, పరిసర ప్రాంతాలలో సమర్థవంతమైన జిల్లా పోలీస్ యంత్రాంగంతో విస్తృత స్థాయిలో భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలు, బందోబస్తు విధుల నిమిత్తం జిల్లా ఎస్పీ తో పాటు 7 గురు అడిషనల్ ఎస్పీ లు, 10 మంది డిఎస్పీ లు, 34 మంది సీఐలు, 77 మంది ఎస్ఐలు, 182 గురు ఏఎస్ఐ/ హెడ్ కానిస్టేబుల్స్, 741 పిసీ లు/ వుమెన్ పిసీలు,110 గురు హోం గార్డులు, 22 గురు ఉమెన్ హోంగార్డు లతో మొత్తం 1184 విధుల్లో పాల్గొంటారని డిఐజీ తెలిపారు. ప్రధానంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సజావుగా కొనసాగేలా చూడాలని, విఐపీ ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా కొనసాగేందుకు అన్ని చర్యలతో విధులు నిర్వహించాలని డిఐజీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎస్పీ డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, ఇతర అడిషనల్ ఎస్పీ లు, డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story