గాయత్రి దేవి పూజలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

by Elthuri vijay kumar |

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు దుర్గాదేవి గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో దేవాలయం వద్ద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిష్ బాల్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

గాయత్రి దేవి పూజలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
X

గాయత్రి దేవి పూజలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

దిశ మిడ్జిల్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు దుర్గాదేవి గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో దేవాలయం వద్ద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిష్ బాల్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం దేవాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు భారీగా తరలిరావా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు గౌస్, సంపత్ కుమార్,నాయకులు బాలయ్య, వెంకటయ్య, రాజేశ్వర్, నరేందర్ రెడ్డి ,మల్లికార్జున్ రెడ్డి, బుచ్చిరెడ్డి, యాదయ్య, ఆదామ్, ఉస్మాన్, శివ ,అశోక్, ఆంజనేయులు, పర్వతాలు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story