MLA Gavinolla Madhusudan Reddy : ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్..

by Batti.Sumithra |

హైదరాబాద్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో బుధవారం మదనాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లెపాగు ప్రశాంత్‌, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ తదితరులు కలిశారు.

MLA Gavinolla Madhusudan Reddy : ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్..
X

దిశ, మాదనాపురం : హైదరాబాద్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో బుధవారం మదనాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లెపాగు ప్రశాంత్‌, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ తదితరులు కలిశారు. మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, నూతన డైరెక్టర్లు విజయ్, శ్రీనివాసులు, రామచంద్రయ్య, పావని, వెంకటేష్ నాయక్, శేఖర్ రెడ్డి, బాలయ్య, మహమూద్, రజినీకాంత్ లు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ తమపై నమ్మకముంచి ఇంత పెద్ద బాధ్యతను ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పెద్దల ఆశీర్వాదంతో మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శరత్ రెడ్డి, మహాదేవన్ గౌడ్, ఉమ్మడి మదనాపురం కొత్తకోట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story