కాంగ్రెస్ లో చేరిన ప‌లువురు స‌ర్పంచ్ లు

by Ratna Kumari |

దిశ‌, రాజాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నిక‌ల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి విజేతలుగా గెలుపొందిన సర్పంచ్ లు

కాంగ్రెస్ లో చేరిన ప‌లువురు స‌ర్పంచ్ లు
X

దిశ‌, రాజాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నిక‌ల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి విజేతలుగా గెలుపొందిన సర్పంచ్ లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాజాపూర్ మండలంలోని మోతుకూల కుంట తండా సర్పంచ్ గీత కృష్ణ నాయక్, నన్ చెరువుతండా సర్పంచ్ వెంకట్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన సర్పంచులు వెంకట్ నాయక్, గీత కృష్ణ నాయక్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలనే ప్రజలకు సంక్షేమ పథకాలు, అందాల అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు. అభివృద్ధి చేసే వాళ్ల‌ సమక్షంలో కలిసి పనిచేస్తామని, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నాయకత్వంలో జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నందున కాంగ్రెస్ పార్టీలో చేరామ‌ని సర్పంచులు తెలిపారు. మాజీ డిప్యూటీ సర్పంచ్ మహేందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Next Story