BRS, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు వచ్చి లింగాల మండలం సూరాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు

BRS, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
X

దిశ, అచ్చంపేట : కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు వచ్చి లింగాల మండలం సూరాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగీనేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమక్షంలో ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో బుధవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలతో స్వాగతం పలికి అనంతరం మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల అందరూ ఐక్యతతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీకి వెన్నుముక్కలాంటి వారిని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కార్యకర్తలకు కృషి చాలా గొప్పది అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల చెంతకు చేర్చే విధంగా కృషి చేయాలి అన్నారు.

Next Story