అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందుల తయారీ.. రూ. 4.66 లక్షల విలువైన పురుగుల మందులు సీజ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైమ్ / అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా

అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందుల తయారీ.. రూ. 4.66 లక్షల విలువైన పురుగుల మందులు సీజ్
X

దిశ, గద్వాల క్రైమ్ / అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పురుగు మందులు తయారు చేస్తున్న ఓ కంపెనీ పై శనివారం అధికారులు దాడి చేశారు. గ్రామంలోని సూపర్ సింబోలా మైక్రో న్యూట్రియంట్ కంపెనీ పరిశ్రమ ఎలాంటి లైసెన్సులు లేకుండా సుమారు 25 రకాల పురుగు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కంపెనీలో తయారు చేసిన ఈ మందులను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన మందుల మొత్తం విలువ రూ. 4,66,820 ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దాడులలో శాంతినగర్ సీఐ టాటా బాబు, అయిజ ఏవో జనార్ధన్, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Next Story