చింతరేవుల అంజన్న స్వామివారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే

by Nallavelli.Anjaneyulu |

దిశ, ధరూర్ : ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

చింతరేవుల అంజన్న స్వామివారిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే
X

దిశ, ధరూర్ : ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంగళవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి , స్వయంభు మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సి.గిరిరావు, ప్రధాన అర్చకులు‌ భీంసేన చారి జోషీ, ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ఈఓ సి.కవిత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story