వైద్య విద్యార్థినికి అండగా నిలిచిన మన్నే జీవన్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ ప్రతినిధి : ఎంతో కష్టపడి చదివి ఎంబిబిఎస్ సీటు సాధించి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థినికి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మన్నే జీవన్ రెడ్డి

వైద్య విద్యార్థినికి అండగా నిలిచిన మన్నే జీవన్ రెడ్డి
X

దిశ, మహబూబ్ ప్రతినిధి : ఎంతో కష్టపడి చదివి ఎంబిబిఎస్ సీటు సాధించి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థినికి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మన్నే జీవన్ రెడ్డి అండగా నిలిచారు. వివరాలలోకి వెళితే మహబూబ్ నగర్ మండలం మాచన్పల్లి తండాకు చెందిన కళావతి రాజేశ్వరి ఎంబీబీఎస్ లో మెరుగైన ర్యాంకు సాధించి పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. రాజేశ్వరి కుటుంబము బీదరికంలో ఉన్న కారణంగా వైద్య విద్య అభ్యాసం కోసం ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మన్నే జీవన్ రెడ్డి రాజేశ్వరికి ఆన్లైన్ ద్వారా ఒక లక్ష 30 వేల రూపాయలు ఆన్ లైన్ ద్వారా పంపించి తన ఉదారతను చాటుకున్నాడు. ఈ సందర్భంగా రాజేశ్వరి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ మన్నే జీవన్ రెడ్డి ఎంతోమందికి వైద్య చికిత్సలు, విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేసి ఇప్పుడు రాజేశ్వరికి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story