- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు జడ్చర్ల కు మందకృష్ణ మాదిగ రాక
దిశ, జడ్చర్ల : మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గురువారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్ లో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా

దిశ, జడ్చర్ల : మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గురువారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్ లో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా మందల కృష్ణ మాదిగ హాజరు కానున్నారని ఎమ్మార్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి బొర్రా బిక్షపతి మాదిగ, ఎమ్మార్పిఎస్, ఎమ్మెస్పీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి టైగర్ జంగయ్య మాదిగ తెలిపారు. భవిష్యత్ లో కార్యచరణ పై సమావేశం జరుగుతుందని.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మార్పిఎస్, ఎమ్మెస్సీ అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు సమయ పాలన పాటించి హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా నాయకులు దగ్గుల బాలరాజు మాదిగ, మైలారం శ్రీ రాములు మాదిగ, బచ్చళ్ళ వినోద్ కుమార్ మాదిగ, కరాటే శ్రీను మాదిగ, కావలి సత్యం మాదిగ, భీమ్ రాజ్ మాదిగ, మండల అధ్యక్షులు కందూరి యాదయ్య మాదిగ, టౌన్ అధ్యక్షులు దేపల్లి రాజేష్ మాదిగ, మహేష్ మాదిగ పాల్గొన్నారు.






